Header Banner

ఏపీలోని వారందరికీ గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి రూ.15 వేలు! మంత్రి కీలక ప్రకటన!

  Fri May 16, 2025 07:36        Politics

ఏపీలోని విద్యార్థులకు గుడ్‌న్యూస్. తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. జూన్ 15న ఈ పథకం ప్రారంభిచంనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ పథకం కింద ఒక్కో విద్యార్థి తల్లి ఖాతాలో రూ.15,000 ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు తెలపారు. 1-12 తరగతుల విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కాగా.. 69.16 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

 

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది వరకే ప్రకటించారు. ఇందులో భాగంగా..'తల్లికి వందనం' పథకాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా.. ఒక్కొక్కరికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వర్తిస్తుంది.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఈ 'ఓసీ' కులం పేరు మార్పు.. కొత్తగా పేరు ఏంటంటే!

 

తాజాగా ఈ పథకంపై కీలక అప్డేట్ వచ్చింది.జూన్ 15న తల్లికి వందనం పథకం ప్రారంభిచనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ పథకం కింద చదువుకునే పిల్లలందరకీ రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పటిష్ఠమైన విద్యా వ్యవస్థకు పునాదులు వేస్తున్నారని తెలిపారు. బీసీ యువతకు సివిల్స్, మెగా డీఎస్సీ ఫ్రీ ట్రైనింగ్ అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులకు విజయవాడలో నగదు ప్రోత్సాహం అందించే కార్యక్రమంలో పాల్గొ్న్న ఆమె.. తల్లికి వందనంపై ఈ మేరకు అప్డేట్ ఇచ్చారు. జూన్ 15న అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు చెప్పారు.

 

కాగా, 2025-26 విద్యా సంవత్సరానికి గాను 'తల్లికి వందనం' పథకం కోసం ప్రభుత్వం రూ.9,407 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా.. వారిలో 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ అంచనా వేసింది. అయితే, ఈ పథకం పొందడానికి విద్యార్థులు కచ్చితంగా 75 శాతం హాజరు కలిగి ఉండాలి. ప్రభుత్వం ప్రస్తుతం ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఆర్థిక సహాయం ఒకేసారి రూ.15,000 చెల్లించాలా లేదా రెండు విడతలుగా రూ.7,500 చొప్పున చెల్లించాలా అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు.

 

'అన్నదాత సుఖీభవ' పథకం మొదటి విడత నిధులు కూడా అదే సమయంలో విడుదల చేయాల్సి ఉండటంతో విడతల వారీగా చెల్లింపుల అంశం తెరపైకి వచ్చింది. ఈ పథకం విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అమలులోకి వస్తుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అర్హులైన విద్యార్థుల సంఖ్య, అవసరమైన నిధులపై ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. ఈ పథకం ద్వారా తల్లులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా పిల్లల విద్యను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

 

ఇది కూడా చదవండితల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఎస్సీ, ఎస్టీ కేసులో సజ్జల భార్గవ్‌కు షాక్‌..! వారిదే తప్పు.. సుప్రీం కోర్టు తేల్చేసింది..!



మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!



వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!



సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!



కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!



చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi # talliki vandanam #AndhraPradesh #GoodNews #15KCredited #GovernmentScheme #APWelfare #FinancialSupport